కరోనాతో రెండురోజుల వ్యవధిలోనేే భార్యభర్తలు మృతిచెందారు. అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలంలో మనం పత్రిక విలేకరిగా పనిచేస్తున్న జనార్ధన్(45) కరోనాతో కొట్టుమిట్టాడుతూ బుధవారం అనంతపురం సవేరా ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. గత రెండు రోజుల క్రితం అతని భార్య అనిత (38)కూడా కరోనాతో పోరాడుతూ హిందూపురం ఆసుపత్రిలో మరణించింది. భార్య మరణించిన విషయం తెలియకుండానే భర్త మృతి చెందాడు. రెండు రోజుల వ్యవధిలో దంపతులు మరణించడంతో ఆ కుటుంబంలో విషాదం అలముకుంది. తల్లిదండ్రులు ఇద్దరూ కరోనాతో మృతిచెందడంతో కుమారుడు నందీశ్వర్ ఒంటరి అయ్యాడు.
కరోనాతో రెండు రోజుల వ్యవధిలోనే భార్య భర్త మృతి - Wife and husband dies at somadevpalli
భర్త కరోనా చికిత్స తీసుకుంటుండగానే .. భార్య వైరస్‌తో పోరాడుతూ మరణించింది. ఆమె చనిపోయిందనే వార్త తెలియకుండానే.. భర్త కూడా కొవిడ్‌తో మరణించాడు. బాధితుడు ఓ పత్రికలో విలేకరిగా పనిచేసేవాడు. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లా సోమందేపల్లిలో జరిగింది.
కరోనా కాటుకి రెండు రోజుల వ్యవధిలో భార్య భర్త మృతి