అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో వైకాపా 11వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. పార్టీ కార్యకర్తలతో కలిసి ప్రభుత్వ చీఫ్ విప్ కాపు రామంచంద్రారెడ్డి వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు. అనంతరం పార్టీ జెండా ఎగురవేసి.., కేకు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తూ.. సీఎం జగన్ పాలన సాగుతోందని కొనియాడారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి వైకాపా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
'రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి వైకాపా ప్రభుత్వం కృషి' - ప్రభుత్వంపై కాపు కామెంట్స్
ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తూ..సీఎం జగన్ పాలన సాగుతోందని ప్రభుత్వం చీఫ్ విప్ కాపు రామచంద్రారెడ్డి కొనియాడారు. రాయదుర్గం పట్టణంలో నిర్వహించిన వైకాపా ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న ఆయన.. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
రాష్ట్ర సర్వతోమూఖాభివృద్ధికి వైకాపా ప్రభుత్వం కృషి