ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

kapu ramachandrareddy: మ.3.30కే గ్రామ సచివాలయానికి తాళం..సిబ్బందిపై ప్రభుత్వ విప్​ ఆగ్రహం - అనంతపురం జిల్లాలో విప్ కాపు

అనంతపురం జిల్లాలోని ఓబుళాపురం(obulapuram) గ్రామ సచివాలయాన్ని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి(whip kapu ramachandrareddy) ఆకస్మికంగా సందర్శించారు. మధ్యాహ్నం మూడున్నర గంటలకే(3:30 clock)... సచివాలయానికి తాళం వేసుకుని సిబ్బంది, ఉద్యోగులు వెళ్లిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులతో చరవాణి(phone)లో మాట్లాడారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి
ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి

By

Published : Oct 18, 2021, 10:30 PM IST

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని డి. హీరేహాళ్ మండలం ఓబుళాపురం గ్రామ సచివాలయాన్ని(obulapuram village secretariat) ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. మధ్యాహ్నం మూడున్నర గంటలకు సందర్శనకు రాగా.. అప్పటికే సచివాలయ ఉద్యోగులు, సిబ్బంది(staff) తాళం వేసుకొని ఇళ్లకు వెళ్లిపోయారు. ఈ ఘటనపై కాపు రామచంద్రారెడ్డి ఆగ్రహం(angry) వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయ పాలన పాటించకుండా గ్రామ సచివాలయం భవనం మూసివేయడంపై మండిపడ్డారు.

మధ్యాహ్నం మూడున్నర గంటలకే సచివాలయానికి తాళం వేసి వెళ్లిపోవడంపై విప్ కాపు రామచంద్రారెడ్డి.. సచివాలయ ఉన్నతాధికారులతో చరవాణిలో మాట్లాడారు. ప్రభుత్వ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఉద్యోగులు, సిబ్బందిపై వెంటనే చర్యలు(act on neglegence) తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం కార్యాలయంలోని రికార్డులను తనిఖీ చేశారు. ఉద్యోగుల హాజరు శాతం పరిశీలించారు.

ఇదీచదవండి.

BADVEL BYPOLLS: 'ఓటు నోటాకు వేసి..వైకాపాకు బుద్ది చెప్పాలి'

ABOUT THE AUTHOR

...view details