ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వారి తప్పులు బయటపడతాయనే సమగ్ర భూ సర్వేను అడ్డుకుంటున్నారు' - అనంతపురం జిల్లా సోమందేపల్లిలో సమగ్ర భూ సర్వే వార్తలు

సమగ్ర భూ సర్వే ద్వారా.. కొన్ని దశాబ్దాలుగా ఉన్న సమస్యలు తొలగిపోతాయని.. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి అన్నారు. అనంతపూరం జిల్లా సోమందేపల్లిలోని కొత్తపల్లి గ్రామంలో సమగ్ర భూ సర్వే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కేవలం తమ తప్పులు బయటపడతాయనే ఉద్దేశంతోనే.. తెదేపా నేతలు ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి యత్నిస్తున్నారని ఆరోపించారు.

whip kapu ramachandra reddy started Comprehensive land survey program in Anantapur
అనంతపురంలో సమగ్ర భూ సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి

By

Published : Dec 23, 2020, 6:38 PM IST

అనంతపూరం జిల్లా సోమందేపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో.. సమగ్ర భూ సర్వే కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ప్రారంభించారు. సమగ్ర భూ సర్వే ద్వారా.. కొన్ని దశాబ్దాలుగా ఉన్న సమస్యలు తొలగిపోతాయన్నారు. ప్రజలకు మేలు కలిగించే కార్యక్రమాలు చేపట్టడంలో వైఎస్సార్ ప్రభుత్వం ఎల్లప్పుడు ముందంజలో ఉంటుందన్నారు.

ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు

సమగ్ర భూ సర్వేలో తమ తప్పులు ఎక్కడ బయటకు వస్తాయో అని తెదేపా అధినేత చంద్రబాబు.. ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని రామచంద్రారెడ్డి మండిపడ్డారు. కేవలం తమ తప్పులు బయటపడతాయనే ఉద్దేశంతోనే.. తెదేపా నేతలు ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి యత్నిస్తున్నారని ఆరోపించారు.

తప్పులకు అవకాశం ఉండదు

భూ సర్వేను.. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి ద్వారా చేపడుతున్నామని, ఎటువంటి పొరపాట్లకు తావుండదని తెలిపారు

ఇదీ చదవండి:

'సచివాలయాలు మరింత మెరుగ్గా పని చేయాలి'

ABOUT THE AUTHOR

...view details