ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మున్సిపల్ ఎన్నికల ప్రచార సిత్రాలు... ! - whip kapu ramachandra reddy news

మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. పట్టణ ఓటర్లను ప్రసన్నం చేసుకోవటానికి నాయకులు శ్రమపడుతున్నారు. ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లా రాయదుర్గంలో.. ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.

whip municipal elections campaigning
మున్సిపల్ ఎన్నికల ప్రచార సిత్రాలు

By

Published : Feb 23, 2021, 9:10 AM IST

వైకాపా ప్రభుత్వంతోనే పట్టణ అభివృద్ధి సాధ్యమని.. రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. ఇంటింటికీ తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. అధికార పార్టీకి ఓట్లు వేయటంతోనే పట్టణంలో.. వివిధ పనులు జరుగుతాయని అన్నారు. ఈ సందర్భంగా రోడ్డు పక్కన ఉన్న అరెసెల దుకాణంలో అరెసెను రుచి చూశారు.

ABOUT THE AUTHOR

...view details