రంజాన్ వేడుకలను ఇళ్లవద్దే జరుపుకోవాలని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ముస్లిం సోదరులకు విజ్ఞప్తి చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గం తహసీల్దార్ కార్యాలయంలో ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించిన ఆయన.. కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రభుత్వాదేశానుసారం ప్రజలు భౌతిక దూరం పాటించాలన్నారు. రంజాన్ మాసంలో ముస్లింలు గుంపులు గుంపులుగా మత ప్రార్థనలు చేయటానికి వీల్లేదన్నారు. వైరస్ నియంత్రణకు పాటుపడాల్సిన బాధ్యత దేశ పౌరులందరిపై ఉందని..బాధ్యతాయుత పౌరులుగా లాక్డౌన్ నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు. అనంతరం ముస్లిం సోదరులకు జిల్లా ఎస్పీ పంపించిన పండ్ల బుట్టలను పంపిణీ చేశారు.
రంజాన్ వేడుకలు ఇళ్ల వద్దే జరుపుకోవాలి: ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి - రంజాన్ వేడులపై విప్ రామచంద్రారెడ్డి కామెంట్స్
దేశ పౌరులుగా కరోనాను నియంత్రించాల్సి బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. రంజాన్ వేడుకలను ఇళ్లవద్దే జరుపుకోవాలని ముస్లిం సోదరులకు విజ్ఞప్తి చేశారు.
రంజాన్ వేడుకలు ఇళ్లవద్దే జరపుకోవాలి