భార్య ముందే భర్తను వేట కొడవళ్లతో ఓ వ్యక్తి దారుణంగా నరికి చంపాడు. తనను కూడా చంపుతాడనే భయంతో అక్కడినుంచి మృతుని భార్య పారిపోయింది. ఈ ఘటన అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలో జరిగింది.
పెనకచెర్లకు చెందిన నాగరాజు అనే వ్యక్తి అతని భార్యతో కలిసి ఉదయం తోట పనికి వెళ్లాడు. భార్యభర్తలిద్దరూ తోట పని చేసుకుంటుండగా అక్కడికి వచ్చిన కురువ ఎర్రిస్వామి అనే వ్యక్తి..వేట కొడవలితో తన భర్తను నరికి చంపాడని మృతుని భార్య తెలిపింది.