ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్వస్థలాలకు.. 1336 మంది పశ్చిమబంగాల్ ​కూలీలు - పశ్చిమబంగాల్​ వలసకూలీలు

లాక్​డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన వలసకూలీలందరూ తమ సొంత రాష్ట్రాలకు పయనమయ్యారు. అనంతపురం జిల్లా పశ్చిమ బంగాల్​కు చెందిన.. 1336 మంది వలసకూలీలు శ్రామిక్ రైలులో తమ స్వస్థలాలకు బయలుదేరారు.

West Bengal migrants  going to their hometowns
స్వస్థలాలకు బయలుదేరిన పశ్చిమబంగాల్​ వలసకూలీలు

By

Published : May 26, 2020, 6:51 AM IST

వలస కూలీలను తమ రాష్ట్రాలకు పంపించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అనంతపురం జిల్లా నుంచి పశ్చిమ బంగాల్​కు చెందిన వలసకూలీలను శ్రామిక్ రైలులో అధికారులు పంపించారు. ఇప్పటి వరకు నాలుగు విడతలుగా రైళ్లలో కూలీలను పంపామని డీఆర్​డీఏ పీడీ జిల్లా ఇంఛార్జ్ అధికారి నరసింహారెడ్డి చెప్పారు.

అనంతపురం జిల్లా నుంచి పశ్చిమబంగాల్​ వెళ్లే చివరి శ్రామిక్ రైలులోనే పశ్చిమ బంగాల్​కు చెందిన 1336 మంది వలసకూలీలను... వారి స్వస్థలాలకు పంపించామన్నారు. ఇంకా ఎవరైనా ఉంటే బస్సుల్లో పంపించి.. వేరే ప్రాంతాల ద్వారా రైళ్లలో గమ్య స్థానాలకు చేరుస్తామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details