అనంతపురం జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన చేనేత కార్మికులతో అనంతపురం కలెక్టరేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం పట్టు పరిశ్రమశాఖ కార్యాలయం వద్ద బైఠాయించి వారి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపీ చేనేత కార్మిక సంఘ నాయకులు చలపతి మాట్లాడుతూ, 8 నెలలుగా పెండింగ్లో ఉన్న బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం చేనేత కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. చేనేత కార్మికులకు కనీసం పాసు పుస్తకాలు లేక అవస్థలు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం చేనేత కార్మికుల సమస్యలపై స్పందించి పరిష్కారం చూపాలని, లేకపోతే రాష్ట్రంలో అన్ని జిల్లాల చేనేత కార్మికులతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు.
చేనేత కార్మికుల ఆందోళన - అనంతపురం
చేనేత కార్మికులకు పెండింగ్ లో ఉన్న ముడి పట్టు రాయితీలను వెంటనే చెల్లించాలంటూ అనంతపురంలో చేనేత కార్మికులు ఆందోళనకు దిగారు.
చేనేత కార్మికుల ఆందోళన