ముఖ్యమంత్రి చిత్రపటానికి నేతన్నల క్షీరాభిషేకం
అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండల కేంద్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి మండల చేనేత కార్మికులు క్షీరాభిషేకం చేశారు. నేతన్న నేస్తం కింద ఇరవై నాలుగు వేల రూపాయలు సాయాన్ని అందించడం మరువలేమని కొనియాడారు.
ముఖ్యమంత్రి చిత్రపటానికి నేతన్నల పాలాభిషేకం
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో నేతన్న నేస్తం కింద ఇరవై నాలుగు వేల రూపాయలను నేతన్నలకు అందించారని అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండల కేంద్రంలో చేనేత కార్మికులు కొనియాడారు. ఆయన సాయాన్ని మరువలేమన్నారు. మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననలు పొందాలని ఆశించారు. తామంతా ఎల్లప్పుడూ జగనన్న వెంటే ఉంటామని స్పష్టం చేశారు. అనంతరం రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.