ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అనర్హులను తొలగించి... అర్హులకు న్యాయం చేయండి' - సోమందేపల్లిలో వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కోసం పట్టు కార్మికులు ధర్నా

వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం అందచేయాలంటూ... అనంతపురం జిల్లా సోమందేపల్లి పట్టు కార్మికులు ధర్నా నిర్వహించారు. అర్హులైన నేతన్నలకు వెంటనే పథకం అందేలా చేయాలని డిమాండ్ చేశారు.

weavers Darna for giving ysr nethanna nestam scheme in somamdhepalli, ananthapuram
వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కోసం పట్టు కార్మికులు ధర్నా

By

Published : Nov 28, 2019, 9:34 PM IST

'అనర్హులను తొలగించి... అర్హులకు న్యాయం చేయండి'

అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలంలోని అర్హులైన చేనేత కార్మికులందరికీ వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం అందజేయాలని ధర్నా నిర్వహించారు. సీపీఎం, సీపీఐ నాయకులు ఆధ్వర్యంలో నేత కార్మికులు ఎంపీడీవో కార్యాలయం ఎదుట బైఠాయించారు. సోమందేపల్లి మండల వ్యాప్తంగా ప్రభుత్వం అందిస్తున్న పట్టు రాయితీ పథకంలో 1250 మంది కార్మికులు ఉన్నారు. నేతన్న నేస్తం పథకంలో మాత్రం కేవలం 787 మందిని మాత్రమే అర్హులుగా ప్రకటించారని పట్టు కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు సర్వే చేయించి అనర్హులను తొలగించి, అర్హులైన వారందరికీ పథకం అమలయ్యే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇదీ చదవండీ:

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details