అనంతపురం జిల్లా ధర్మవరంలో అప్పుల బాధ తట్టుకోలేక చేనేత కార్మికుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రామ్‌నగర్‌లో నివాసం ఉంటున్న దామోదర్.. ఐదు చేనేత మగ్గాలు ఏర్పాటు చేసుకున్నాడు. వాటి నిర్వహణకు పది లక్షలు అప్పు చేశాడు. మగ్గం నేస్తూ జీవనం సాగిస్తున్న దామోదర్‌కు వడ్డీలు చెల్లించటం భారమైంది. రుణదాతలు సొమ్ము చెల్లించాలని ఒత్తిడి తెచ్చారు. అవమానం తట్టుకోలేక ఇంటిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ధర్మవరంలో చేనేత కార్మికుడి ఆత్మహత్య - weaver laborer dies in dharamavaram
అప్పుల బాధతో చేనేత కార్మికుడు ఉరివేసుకుని మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా ధర్మవరంలోని రామ్ నగర్లో జరిగింది.ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ధర్మవరంలో చేనేత కార్మికుడి ఆత్మహత్య