రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా నేతలు ఎన్ని అరాచకాలు సృష్టించినా... స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి తీరుతామని మాజీ మంత్రి పరిటాల సునీత ధీమా వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో తెదేపా తరఫున జడ్పీటీసీ అభ్యర్థులు నామినేషన్ వేస్తున్న సందర్భంగా వారిని బలపరిచేందుకు జడ్పీ కార్యాలయానికి వెళ్లారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా వైకాపా నేతలు తెదేపా శ్రేణులపై దాడులకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. అనంతపురం జిల్లాలోనూ తెదేపా అభ్యర్థులు కనీసం నామినేషన్ వేసేందుకు రానివ్వకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఉందని ఇలా చేస్తే... ఎన్నికల్లో గెలిచేది తెదేపానే అని గుర్తుంచుకోవాలని సునీత హెచ్చరించారు.
స్థానిక ఎన్నికల్లో గెలిచి తీరుతాం: పరిటాల సునీత - స్థానిక ఎన్నికల్లో గెలిచి తీరుతామన్న పరిటాల సునీత
అనంతపురం జిల్లాలో వైకాపా నేతలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా... స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపానే గెలిచి తీరుతుందని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. జిల్లాలో తెదేపా అభ్యర్థులు కనీసం నామినేషన్ వేసేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు.
![స్థానిక ఎన్నికల్లో గెలిచి తీరుతాం: పరిటాల సునీత former minister paritala sunitha speaks about attacks on tdp members in local elections](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6371778-706-6371778-1583929428843.jpg)
ఎన్ని అడ్డంకులు వేసినా స్థానిక ఎన్నికల్లో గెలిచి తీరుతామన్న పరిటాల సునీత
మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి పరిటాల సునీత
TAGGED:
పరిటాల సునీత వార్తలు