చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అనంతపురం జిల్లా కదిరి డీఎస్పీ భవ్య కిశోర్ అన్నారు. నిషేధిత గంజాయి, గుట్కా, ఇతర ప్రాంతాల నుంచి మద్యం అక్రమంగా సరఫరా చేసే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. మానవ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రజల సహకారంతో కార్యాచరణను సిద్ధం చేస్తామన్నారు. దీనిపై ఇదివరకు అవగాహనా కార్యక్రమాలు చేపట్టామని.. ఇకపై మరింత దృష్టి సారిస్తామని చెప్పారు. ట్రాఫిక్ అడ్డంకులు తొలగించేందుకు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పనిచేస్తామని తెలిపారు.
'మానవ అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటాం'
శాంతి భద్రతల పరిరక్షణకే తొలి ప్రాధాన్యం అని డీఎస్పీ భవ్య కిశోర్ అన్నారు. అనంతపురం జిల్లా కదిరి డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఆమె పలు అంశాలకు సంబంధించి భవిష్యత్ కార్యచరణపై మాట్లాడారు.
కదిరి డీఎస్పీ భవ్య కిశోర్