అనంతపురం జిల్లా ఉరవకొండలో జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సిద్ధం చేసిన లేఅవుట్ను సందర్శించారు. అనంతరం స్థానిక అధికారులతో కలిసి నివాస స్థలాల పట్టాల పంపిణీపై సమీక్ష నిర్వహించారు.
కేటాయించేందుకు అనేక సమస్యలు..
ఉరవకొండ పట్టణంలో పేదలకు ఇళ్ల పట్టాలు కేటాయించేందుకు అనేక సమస్యలు ఉన్నాయని.. వాటిని పరిష్కరించేందుకు సమీక్షా సమావేశం నిర్వహించామని జేసీ అన్నారు.