అనంతపురం జిల్లా ధర్మవరం పురపాలక సంఘంలో నీటి పన్ను చెల్లింపుపై వివాదం చెలరేగింది. స్థానిక శారదా నగర్లో పన్ను చెల్లించని ఇళ్లకు మున్సిపల్ సిబ్బంది నీటి కుళాయిలు తొలగించారు. తమకు నోటీసులు కూడా ఇవ్వకుండా కుళాయిలు తొలగించడం ఏమిటని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జునతో స్థానిక మహిళలు వాగ్వాదానికి దిగారు. మున్సిపల్ సిబ్బంది విధులకు ఆటంకం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. రాజకీయ కక్ష సాధింపులతో, అధికార పార్టీ ఒత్తిడితో అధికారులు కుళాయిలు తొలగిస్తున్నారని శారదానగర్ వాసులు ఆరోపిస్తున్నారు.
'నోటీసులు ఇవ్వకుండా కుళాయిలు ఎలా తొలగిస్తారు?' - dharmavaram water tax issue
అనంతపురం జిల్లా ధర్మవరం పురపాలక సంఘంలో నీటి పన్ను చెల్లించని ఇళ్ల కుళాయిలు తొలగించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తొలగించడం ఏంటంటూ.. శారదా నగర్లో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

water tax issue at dharmavaram