నాలుగు నెలలుగా జీతాలు రాక.. తమ కుటుంబాలు పస్తులుండాల్సి వస్తోందని... తమ గోడు పట్టించుకునే వారేలేరని అనంతపురం జిల్లా ఉరవకొండలో నీటి సరఫరా కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రావాల్సిన నాలుగు నెలల జీతాన్ని, 26 నెలల పీఎఫ్ డబ్బులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఇల్లు గడవటం కష్టంగా ఉంది... బకాయిలు చెల్లించండి సార్..! - అనంతపురంలో నీటి సరఫరా కార్మికుల నిరసనలు వార్తలు
కరోనా లాక్డౌన్ నేపథ్యంలో 4 నెలల జీతం, 26 నెలల పీఎఫ్ డబ్బులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని.. అనంతపురం జిల్లా ఉరవకొండలో నీటి సరఫరా కార్మికులు ఆవేదన చెందుతున్నారు. వెంటనే తమకు రావల్సిన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.

water-supply-workers-protest-for-salaries-at-uravakonda-in-anantapur
ఈ మేరకు కార్మికులంతా విధులు బహిష్కరించి... నీటి సరఫరా కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. 50 లక్షల ప్రమాద బీమా కల్పించాలని కోరారు. కరోనా నేపథ్యంలో తమకు.. అధికారులు ఎటువంటి జాగ్రత్తలు చెప్పడంలేదని ఆరోపించారు. శానిటైజర్లు, మాస్కులు వంటివి కూడా పంపిణీ చేయలేదని ఆవేదన చెందారు.
ఇదీ చదవండి:ఎంతటి ఓర్పు.. ఎంతటి నిబద్ధత..!