ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హంద్రీనీవా కాలువ నుంచి చెరువులకు నీటి విడుదల - హంద్రీవీవా కాలువ నీటి విడుదల వార్తలు

అనంతపురం జిల్లా పెనుకొండ మండలం చెరువులకు.. హంద్రీనీవా కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు. హరిపురం వద్ద నీరు నిల్వ అవ్వటంతో.. స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

handrineeva canal
హంద్రీనీవా కాలువ నుంచి చెరువులకు నీటి విడుదల

By

Published : Sep 12, 2020, 11:21 AM IST

అనంతపురం జిల్లా పెనుకొండ మండలం గొల్లపల్లి జలాశయం నుంచి.. హంద్రీనీవా కాలువ ద్వారా చెరువులకు నీటి విడుదల చేశారు. మండలంలోని హరిపురం సమీపంలో హంద్రీనీవా కాలువ నుంచి చిన్నప్పరెడ్డి పల్లి, మునిమడుగు గ్రామాల చెరువులకు నీటి విడుదల ప్రారంభించారు. హరిపురం సమీపంలో రైల్వే భూగర్భ పనులు జరుగుతుండటంతో.. నీరు నిల్వ అయ్యింది. దీంతో వంతెన కింద నుంచి ప్రయాణించటానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి.. రైల్వే వంతెన కింద నిల్వ నీటిని తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details