అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం చాగల్లు జలాశయానికి నీటి ఉద్ధృతి పెరిగింది. దీంతో అధికారులు 2 గేట్లు అడుగు మేర ఎత్తి పెన్నా నదికి నీరు విడుదల చేశారు. చాగల్లు జలాశయం పూర్తి నీటి నీటి సామర్థ్యం 1.50 టీఎంసీలు. ప్రస్తుతం అందులో 1 టీఎంసీ నీరు ఉంది. మరోసారి వర్షం కురిసి జలాశయానికి నీరు చేరితే కొన్ని గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. దీంతో ముందుజాగ్రత్తగా జలాశయం గేట్లు ఎత్తి నీటిని పెన్నానదికి విడుదల చేశారు.
చాగల్లు జలాశయం నుంచి పెన్నా నదికి నీరు విడుదల - చాగల్లు జలాశయం నుంచి నీరు విడుదల
అనంతపురం జిల్లా చాగల్లు జలాశయం నుంచి దిగువకు నీరు విడుదల చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు జలాశయం ఉద్ధృతంగా మారింది. దీంతో ముందుజాగ్రత్తగా అధికారులు నీరు విడుదల చేశారు.

చాగళ్లు జలాశయం