ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Mid Pennar Reservoir Gates Open: పెన్నా నదికి వరద ముప్పు.. మిడ్ పెన్నార్‌ రిజర్వాయర్ నుంచి నీటి విడుదల - పెన్నా నదికి వరద ముప్పు

పెన్నా నదికి భారీ వరద వచ్చే అవకాశం(heavy floods in Penna river) ఉందన్నహెచ్చరికలతో అనంతపురం జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో పెన్నా నదిపై ఉన్న మిడ్​ పెన్నార్ జలాశయం నుంచి దిగువకు నీటిని విడుదల(water release from Mid Pennar reservoir ) చేస్తున్నారు.

Mid Pennar Reservoir Gates Open
మిడ్ పెన్నార్‌ రిజర్వాయర్ నుంచి నీటి విడుదల

By

Published : Nov 27, 2021, 12:40 AM IST

Mid Pennar Reservoir Gates Open: అనంతపురం జిల్లాలో పెన్నా నదిపై ఉన్న జలశయాల నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మిడ్​ పెన్నార్ జలాశయం(ఎంపీఆర్) నుంచి దిగువకు నీటిని విడుదల(water release from Mid Pennar reservoir) చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికతో అక్కడి అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. కర్ణాటకలోని పెన్నా నది పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. దీంతో పెన్నా నదికి(floods in Penna river) భారీ వరద వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కర్ణాటక అధికారులు.. అనంతపురం జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. గురువారం పేరూరు జలాశయం గేటు తెరిచి దిగువకు నీటిని విడుదల చేయగా.. ఆ ప్రవాహం పీఏబీఆర్ చేరింది. మిడ్​ పెన్నార్ జలాశయంలోనూ నీరు గరిష్ఠ స్థాయికి చేరడంతో దిగువకు నీటిని విడుదల(water release from Mid Pennar reservoir) చేస్తున్నారు.

ఎగువ నుంచి నీరు విడుదల చేయాలంటే నిండు కుండలా ఉన్న ఎంపీఆర్ జలాశయాన్ని ఖాళీగా ఉంచాల్సిన అవసరం ఉంది. పెన్నాకు భారీ వరద ముంపు హెచ్చరికలు, ఉన్నతాధికారుల ఆదేశంతో ఎంపీఆర్ జలాశయం మూడు గేట్లు తెరిచి 3,600 క్యూసెక్కుల నీటిని పెన్నా నదిలోకి విడుదల(Mpr Gates Open) చేశారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత గేట్లు తెరిచి నదిలోకి ప్రవాహాలు విడుదల చేశారు. ఈ కమనీయ దృశ్యాన్ని చూడటానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. గేట్ల నుంచి నీరు దిగువకు దూకే సమయంలో కేకలు వేస్తూ ఆనందం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details