ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంకంపల్లి పంప్ హౌస్ నుంచి నీరు విడుదల - ఎంపీ తలారి రంగయ్య తాజా వార్తలు

అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం అంకంపల్లి పంప్ హౌస్ నుంచి బెలుగుప్ప, శిర్పి చెరువులకు ఎంపీ తలారి రంగయ్య, మాజీ ఎమ్మెల్యే విశ్వేరశ్వర్​రెడ్డి నీటిని వీడుదల చేశారు. రాష్ట్రంలో రైతులు బాగుండాలనేదే వైకాపా ప్రభుత్వ లక్ష్యమని నేతలు స్పష్టం చేశారు.

krishna water in anantapur district
నీటిని విడుదల చేస్తున్న ఎంపీ, నేతలు

By

Published : Sep 4, 2020, 11:32 AM IST

ఉరవకొండ నియోజకవర్గంలోని బెలుగుప్ప మండలం అంకంపల్లి పంప్ హౌస్ నుంచి శీర్పి, బెలుగుప్ప చెరువులకు ఎంపీ తలారి రంగయ్య, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్ రెడ్డి నీరు విడుదల చేశారు. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం స్విచ్ ఆన్ చేసి పంప్ హౌస్ నుంచి హంద్రీనీవా నీటిని విడుదల చేశారు. అనంతరం కెనాల్ వద్ద గంగ పూజ చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ… రాష్ట్రంలో రైతు బాగుండాలని, రైతు బాగుపడాలని సీఎం జగన్ అనుక్షణం కష్టపడుతున్నారని పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలో హంద్రీనీవా ద్వారా రెండు లక్షల ఎకరాలకు నీరు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు. ఇప్పటికే అనేక చెరువులకు నీరు విడుదల చేశామని, మిగతా అన్ని చెరువులను కృష్ణా జలాలతో నింపుతామన్నారు.

ABOUT THE AUTHOR

...view details