పెన్నా నదికి ఎగువ నుంచి వస్తున్న వరదతో.. అనంతపురం జిలాల్లోని(penna river water flow) జలాశయాలు నిండుకుండలా మారాయి. దీంతో నదిపై ఉన్న అన్ని డ్యామ్‌ల గేట్లూ ఎత్తి, దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఫలితంగా.. జిల్లాలోని పెన్నా అహోబిలం రిజర్వాయర్ గేట్లు ఎత్తి, వెయ్యి క్యూసెక్కుల నీటి విడుదల చేశారు.
మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ అధికారుల హెచ్చరికలతో ముందస్తుగా డ్యామ్ గేట్లు ఎత్తినట్లు సిబ్బంది తెలిపారు. ఈ క్రమంలో ఉరవకొండ, కూడేరు తహసీల్దార్లు డ్యామ్ పరిస్థితిని సమీక్షించారు.