చిట్టా వెంకటస్వామి కాలనీలో తాగునీటి సమస్య కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని ఓ పక్క చెప్తుంటే, చేతులు కడుక్కునేందుకు కాదు... తాగేందుకే నీళ్లు లేవంటూ అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని చిట్టా వెంకటస్వామి కాలనీ వాసులు నీటి కోసం అల్లాడుతున్నారు.
గత 10 రోజుల నుంచి కుళాయిల నుంచి చుక్క నీరు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీ వాసులు వాపోయారు.
ఎన్నిసార్లు అధికారులకు మెుర పెట్టుకున్నా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వినతి పత్రాలు అందజేసినా ప్రయోజనం లేకపోగా, కార్యాలయాల వద్దకు వెళ్తే అధికారులు హేళనగా మాట్లాడుతున్నారని వారు ఆరోపించారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు నీటి కష్టాలు తప్పించాలని వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి:అనంతపురం జిల్లా వ్యాప్తంగా లాక్డౌన్