అనంతపురం జిల్లాలో తాగునీటి కోసం ఖాళీ బిందెలతో మహిళలు ఆందోళనకు దిగారు. చెన్నేకొత్తపల్లిలోని ఎస్టీ కాలనీలో పది రోజులుగా తాగునీరు అందకపోవడంతో... మహిళలు ఖాళీ బిందెలతో ఎంపీడీఓ కార్యాలయాలనికి తరలివచ్చారు. కాలనీలో ఉన్న బోరు చెడిపోవడంతో నీటి సరఫరా ఆగిపోయింది. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని తెలిపారు. అధికారులు బయటకు వచ్చి మహిళలతో మాట్లాడారు. బోరు మరమ్మతు అయ్యే వరకు ట్యాంకర్ ద్వారా నీరు సరఫరా చేస్తామని చెప్పడంతో మహిళలు శాంతించారు.
ఖాళీ బిందెలతో మహిళల ఆందోళన - water scarcity at kothaplli
చెన్నేకొత్తపల్లిలోని ఎస్టీ కాలనీలో పది రోజులుగా తాగునీరు అందకపోవడంతో... మహిళలు ఖాళీ బిందెలతో ఎంపీడీఓ కార్యాలయాలం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ట్యాంకర్ ద్వారా నీరు సరఫరా చేస్తామని అధికారులు హామీఇవ్వగా మహిళలు శాంతించారు.
ఖాళీ బిందెలతో మహిళల ఆందోళన