అనంతపురం జిల్లాలో శ్రీరామ్ రెడ్డి నీటి పథకం ఉద్యోగులు సమ్మె చేసిన కారణంగా 1037 గ్రామాలకు నీటి సమస్య ఏర్పడింది. జిల్లాలోని పెన్నహోబిలం రిజర్వాయర్ నుంచి ఉరవకొండ, కళ్యాణదుర్గం, రాయదుర్గం, మడకశిర, హిందూపురం నియోజకవర్గంలోని వందలాది గ్రామాలకు ఈ పథకం ద్వారా మంచి నీరు అందుతోంది. ఇక్కడ 700 మందికి పైగా కార్మికులకు గత ఐదు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంపై సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. రిజర్వాయర్ పంప్ హౌస్ మోటార్లు నిలిపేశారు. మిగిలిన ప్రాంతాల్లోనూ కార్మికులు నిరసన వ్యక్తం చేస్తూ మోటార్లను ఆఫ్ చేశారు.
1037 గ్రామాలకు మంచినీటి సమస్య - Pump house employees protest in ananthapur
అనంతపురం జిల్లాలో లక్షలాది మంది దాహార్తిని తీర్చే శ్రీరామ్ రెడ్డి నీటి పథకం ఉద్యోగులు సమ్మెకు దిగిన కారణంగా.. 1037 గ్రామాలకు నీటి సమస్య ఏర్పడుతోంది. ఐదు నెలలుగా జీతాలు ఇవ్వటం లేదంటూ ఉద్యోగులు ధర్నా చేశారు.
పంప్ హౌస్