ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Water problem: వృథా నీరే.. ఆధారమాయె! - కంబదూరులో నీటి కష్టాలు

అనంతపురం జిల్లా కంబదూరు మండలం ఐపార్శపల్లిలో పంచాయతీ అధికారుల నిర్లక్ష్యంతో.. గ్రామస్థులకు నీటి కష్టాలు మొదలయ్యాయి. ప్రధాన పైపులైనుకు ఓచోట లీకేజీ ఏర్పడి నీరు వృథాగా వెళుతోంది. దీంతో గ్రామస్థులు డ్రిప్‌ పైపుల ద్వారా వృథా నీటిని తమ ఇళ్లకు సరఫరా చేస్తున్నారు.

water problem at kabaduru
water problem at kabaduru

By

Published : Oct 9, 2021, 10:03 AM IST

అనంతపురం జిల్లా కంబదూరు మండలం ఐపార్శపల్లిలో నీటి కష్టాలకు ఈ చిత్రమే నిదర్శనం. గ్రామంలో ఏర్పాటు చేసిన కొళాయిలకు మూడు రోజులకోసారి నీరు వస్తున్నాయి. అందులోనూ అరకొరే. అయితే గ్రామం మీదుగా ఏర్పాటు చేసిన పంచాయతీ ప్రధాన పైపులైనుకు ఓచోట లీకేజీ ఏర్పడి నీరు వృథాగా వెళుతోంది. దీంతో గ్రామస్థులు డ్రిప్‌ పైపుల ద్వారా వృథా నీటిని తమ ఇళ్లకు సరఫరా చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, లీకేజీని అరికట్టి కొళాయిలకు నిత్యం నీరివ్వాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details