అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం సమీపంలో సత్యసాయి పైప్లైన్కు గండి పడింది. పైప్లైన్ నుంచి భారీగా మంచినీరు వృథా అవుతోంది. మండలంలోని గరుడాపురం సమీపంలో వందలాది గ్రామాలకు తాగునీటిని ఈ లైన్ తోనే అందిస్తారు.
ఈ పైప్లైన్ పగిలిపోవడం వల్ల మంచినీరు వ్యవసాయ పొలాల్లో ప్రవహించింది. భారీగా వృథా అయ్యింది. సంబంధిత అధికారులు అప్రమత్తమై వెంటనే నీటి సరఫరాను ఆపి మరమ్మతు పనులు ప్రారంభించారు.