అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలో.. ఎవరైనా నీరు వృథా చేస్తే కుళాయి కనెక్షన్ తొలగిస్తామని అధికారులు హెచ్చరించారు. వేసవిలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉండటంతో.. మూడు రోజులకు సరిపడా నీరు మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. రోడ్లపైకి, మురికి కాలువలోకి నీటిని వృథాగా వదలకూడదని తెలిపారు. ఈ మేరకు కమిషనర్ వెంకటరాముడు ఓ ప్రకటన విడుదల చేశారు.
నీరు వృథా చేస్తే... కనెక్షన్ కట్! - ఏపీలో మంచినీటి కష్టాలు
నీటిని వృథా చేస్తే చర్యలు తప్పవని అనంతపురం జిల్లా అధికారులు కళ్యాణదుర్గం వాసులను హెచ్చరించారు. అలా చేస్తే కుళాయి కనెక్షన్ తొలగిస్తామని తెలిపారు.
![నీరు వృథా చేస్తే... కనెక్షన్ కట్! water](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6963524-998-6963524-1587990299559.jpg)
water