ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంచినీటి గంట మోగింది.. వాటర్​ బాటిల్​ ఖాళీ అయ్యింది..! - latest news in madakashira

అక్కడ గంట మోగిందంటే పిల్లలందరూ వాటర్ బాటిల్స్​ను ఖాళీ చేసేస్తారు. గంట మోగటానికి వాటర్ బాటిల్ ఖాళీ అవ్వటానికీ ఏంటి సంబంధం అనుకుంటున్నారా? ఆ విషయం గురించి తెలుసుకోవాలంటే అనంతపురం జిల్లా మడకశిర పట్టణం వైపు వెళ్లాల్సిందే.

మోగెను మంచినీటి గంట...!

By

Published : Nov 17, 2019, 8:55 AM IST

మోగెను మంచినీటి గంట...!
అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో ఉన్న శ్రద్ధ ఇంటిలెక్చువల్ ప్రైవేట్​ పాఠశాలలో గంట మోగగానే విద్యార్థులందరూ వాటర్ బాటిల్స్​ తాగటం మెుదలు పెడతారు. ఇది యాజమాన్యం పెట్టిన నియమం. ఎందుకంటే విద్యార్థులు మంచినీటిని తగు మోతాదులో తీసుకోవటం లేదని గుర్తించిన స్కూలు పెద్దలు ఈ నిబంధన తీసుకొచ్చారు. పాఠశాల ప్రారంభమైన నుంచి ముగిసే వరకూ మూడు సార్లు నీటి గంటను మోగిస్తారు. ఇలా తగు సమయాల్లో నీరు తాగడం వల్ల విద్యార్థులకు డీహైడ్రేషన్, ఇతర ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని యాజమాన్యం వివరిస్తోంది. నీటి గంట కార్యక్రమం మెుదలై ఐదు రోజలవుతోందనీ, నీటిని ఎక్కువ తాగుతున్న విద్యార్థులు ఉత్సాహంగా ఉంటున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. ప్రతీ పాఠశాలలో ఈ కార్యక్రమం చెపడితే, అనారోగ్యాలతో విద్యార్థులు బాధపడరని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details