అనంతలో తెదేపా, వైకాపా వర్గీయుల ఘర్షణ - WAR ON TDP-YSRCP IN ANANTHAPURAM
వినాయక చవితి వేడుకల విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తి.. పరస్పరం దాడులు చేసుకున్న ఘటన అనంత జిల్లా ఎ.కొండాపురంలో జరిగింది. అయితే వైకాపా కార్యకర్తలు కావాలనే దాడులు చేశారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.
అనంతపురం జిల్లా పుట్లూరు మండలం ఎ.కొండాపురంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. గ్రామంలో వినాయక చవితి వేడుకల విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తి... పరస్పరం దాడులు చేసుకున్నారు. ఘటనలో తెదేపాకు చెందిన నలుగురికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన రాజేష్ అనే వ్యక్తిని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైకాపాకు చెందిన ఇద్దరు కార్యకర్తలు గాయపడ్డారు. వైకాపాకు అడ్డు తగులుతున్నాడనే కారణంతోనే అతడిని లక్ష్యంగా చేసుకుని రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారని తెదేపా వర్గీయులు ఆరోపించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.