అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో గతంలో ఎలుగుబంట్ల దాడిలో చాలా మంది మృతి చెందారు. ఈ ప్రాంతంలో వీటి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రతిసారీ నియోజకవర్గంలో ఎక్కడో ఒకచోట ఇవి కనిపించడం వీటి పెరుగుదలకు నిదర్శనం.ఈ నేపథ్యంలో రోళ్ల మండలం వన్నారనపల్లి గ్రామ సమీపంలోని పంట పొలాల్లో ఎలుగుబంటి సంచరించింది. పొలాల్లో పనులు చేస్తున్న రైతులు, గ్రామ ప్రజలు దీన్ని చూసి ఆందోళన చెందారు. చాలా సమయం తర్వాత ఆ ఎలుగుబంటి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పంటలు చేతికి వచ్చిన సమయంలో ఒంటరిగా వెళ్లి పనులు చేస్తూ ఉంటాము. ఎలుగుబంట్ల నుంచి ఎప్పుడు ఏ ఆపద ముంచుకొస్తుందో తెలియదు. ఒకోసారి రాత్రి సమయాల్లో గ్రామాల్లోకి ఎలుగుబంట్లు వచ్చి వెళుతుంటాయి. వీటి సంచారం అధికంగా ఉంది. బయటకు వెళ్లేందుకు భయాందోళన చెందుతున్నామంటున్నారు గ్రామస్థులు. అటవీ అధికారులు వన్యప్రాణుల నుంచి ప్రజలకు రక్షించాలని కోరుతున్నారు.
రోళ్ల మండలంలో ఎలుగుబంటి సంచారం... ఆందోళనలో గ్రామస్థులు - అనంతపురం జిల్లాలో ఎలుగుబంటి వార్తలు
అనంతపురం జిల్లా రోళ్లమండలం వన్నారపల్లి గ్రామ సమీపంలోని పంటపొలాల్లోకి ఎలుగుబంటి వచ్చింది. గతంలో ఎలుగుబంటి దాడిలో పలువురు మృతి చెందటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
రోళ్ల మండలంలో ఎలుగుబంటి సంచారం