అనంతపురం జిల్లా కంబదూరు మండలం దేవేంద్రపురం గ్రామ పరిసరాల్లో ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. పంట పొలాల మీద పడిన ఎలుగుబంటి టమాట, వేరుశనగతో పాటు ఇతర పంటలను నాశనం చేస్తోందని రైతులు వాపోతున్నారు. కొంతమంది యువకులు కలిసి ఆ ఎలుగును తరిమికొట్టారు. అయినప్పటికీ అది మళ్లీ వచ్చే అవకాశం ఉందని.. అటవీశాఖ అధికారులు స్పందించి తమ పంటలను రక్షించాలని రైతులు కోరారు.
పంటపొలాలను నాశనం చేస్తున్న ఎలుగుబంటి - దేవేంద్రపురంలో ఎలుగుబంటి సంచారం
అనంతపురం జిల్లా దేవేంద్రపురం గ్రామ పరిసరాల్లో ఎలుగుబంటి సంచరిస్తూ పంటపొలాలను నాశనం చేస్తోందని స్థానికులు తెలిపారు. అటవీశాఖ అధికారులు స్పందించి తమ పంటలను రక్షించాలని రైతులు కోరారు.
పంటపొలాలను నాశనం చేస్తున్న ఎలుగుబంటి