అనంతపురం జిల్లా ఉరవకొండ పోలీస్‌స్టేషన్‌లో ఆయుధపూజ నిర్వహించారు. దసరా మహోత్సవాల్లో భాగంగా.. సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు.
ఉరవకొండ స్టేషన్లో పోలీసుల ఆయుధపూజ - ఉరవకొండ పోలీసుల దసరా ఉత్సవాలు
దసరా సందర్భంగా పోలీసులు ఆయుధపూజ చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండ పోలీస్‌స్టేషన్‌లో.. సిబ్బందితో కలిసి సీఐ పూజ నిర్వహించారు. ఏటా సంప్రదాయంగా వస్తున్న కార్యక్రమాన్ని ఈ ఏడాదీ కొనసాగించారు.
ఉరవకొండ పోలీస్‌స్టేషన్‌లో ఆయుధపూజ
ప్రతి ఏడాది ఆయుధ పూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని స్టేషన్ సిబ్బంది తెలిపారు. అదే తరహాలో ఈ ఏడాదీ శాస్త్రోక్తంగా అమ్మవారి ఫొటో ముందు ఆయుధాలను ఉంచి.. పూజారుల చేత పూజ చేయించామన్నారు.
ఇదీ చదవండి:రొద్దం మండలంలో అక్రమ మద్యం పట్టివేత...ఒకరి అరెస్ట్