సర్వర్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రత్యామ్నాయ విత్తనాల కోసం వచ్చిన రైతులు అసౌకర్యానికి గురయ్యారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో ఉన్న వ్యవసాయ శాఖ కార్యాలయంలో సర్వర్ మొరాయించింది. సకాలంలో వర్షాలు కురవక పోవడంతో రైతులు వేరుశనగ సాగు చేయలేకపోయారు. రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సాగుకు ఆసక్తి చూపుతున్నారు. పంటకు అనుకూల వర్షాలు కురవడంతో అన్నదాతలు చిరుధాన్యాల సాగు పై ఆసక్తి కనపరుస్తున్నారు. ఉచితంగా పంపిణీ చేస్తున్న ప్రత్యామ్నాయ విత్తనాలను తీసుకునేందుకు బారులు తీరారు. ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటిగంట దాకా సర్వర్ సమస్య తలెత్తడంతో ఆందోళనకు లోనయ్యారు. వరుసలో ఉన్న ఒక మహిళ అస్వస్థతకు గురై కిందపడిపోయింది.
సర్వర్లో లోపం.. రైతులకు శాపం - farmers
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో సాంకేతిక లోపాలతో రైతులకు ఇక్కట్లు తప్పటంలేదు.
రైతులు