రోడ్డు ప్రమాదంలో వీఆర్ఏ మృతి - crime news ananthapuram district
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వీఆర్ఏ వెంకటేశ్ మృతిచెందాడు. ఆనంతపురం నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో వెంకటేశ్ దుర్మరణం చెందాడు.

రోడ్డు ప్రమాదంలో వీఆర్ఏ మృతి
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బెలుగుప్ప మండలం అంకంపల్లి గ్రామానికి చెందిన వీఆర్ఏ వెంకటేశ్ మృతి చెందాడు. తన విధులు ముగించుకోని వెంకటేశ్ అనంతపురం వైపు వెళ్తుండగా వేగంగా వస్తున్న కారు ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడ్డ వెంకటేశ్‌ను కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో వెంకటేశ్ మృతిచెందినట్లు అతని స్నేహితులు తెలిపారు.