ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఓట్ల జాబితాలో వైఎస్​ఆర్​సీపీ నాయకుల అక్రమాలు - బతికుండగానే చనిపోయినట్టు తొలగింపు - Name Placed in Death Voter List anantapur

Votes Deletion in Ap by YSRCP Leaders: ప్రతిపక్ష పార్టీ సానుభూతి పరుల ఓట్ల తొలగింపే లక్ష్యంగా అధికార పార్టీ నాయకులు అక్రమాలు కొనసాగిస్తున్నారు. అనంతపురం జిల్లాలో బతికి ఉండగానే చనిపోయినట్టు, ఊరిలో ఉన్న లేరని చూపించి ఓట్ల జాబితా నుంచి ఓటు తొలగించడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓటు తొలగించాలని చేసిన ఫిర్యాదుపై విచారణ జరపకుండానే బీఎల్వో నివేదిక తయారు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Votes_Deletion_in_Ap_by_YSRCP_Leaders
Votes_Deletion_in_Ap_by_YSRCP_Leaders

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 13, 2023, 12:30 PM IST

ఓట్ల జాబితాలో వైఎస్​ఆర్​సీపీ నాయకుల అక్రమాలు - బతికుండగానే చనిపోయినట్టు తొలగింపు

Votes Deletion in Ap by YSRCP Leaders: ప్రజాస్వామ్యాన్ని పరిహసించేలా ఓట్ల అక్రమాలను వైఎస్​ఆర్​సీపీ నేతలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఫారం-7 (Form-7) దరఖాస్తుల ద్వారా విపక్షాల ఓట్లు తొలగించేందుకు వైఎస్​ఆర్​సీపీ నేతలు చేస్తున్న కుట్రలు బట్టబయలవుతున్నా ఎన్నికల యంత్రాంగం చోద్యం చూస్తోంది. మన ఓట్లు అనుకునేవే జాబితాలో ఉండాలి. మనవి కానివి తీసేయించాలి అనే పద్ధతిని వైఎస్​ఆర్​సీపీ నాయకులు అనుసరిస్తున్నారు.

YCP Leaders Conspired to Remove TDP Sympathizers Votes: రాష్ట్రంలో 2లక్షల 45వేల ఓట్ల తొలగింపునకు వైసీపీ కుట్ర: ఎమ్మెల్యే ఏలూరి

TDP Sympathizers Votes Removing in Anatapur District: అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం విడపనకల్లు మండలంలోని ఓట్ల జాబితాలో వైఎస్​ఆర్​సీపీ నేతల కుట్రలు బయటపడుతున్నాయి. తెలుగుదేశం మద్దతుదారుల పేర్లను బతికి ఉండగానే చనిపోయినట్టు, ఊరిలో ఉన్న లేరని చూపించి ఓట్ల జాబితా నుంచి పేరును వైఎస్​ఆర్​సీపీ నాయకులు తొలగించారని బాధితులు వాపోతున్నారు. తాజాగా టీడీపీకి మద్దతుగా ఉండే ఇద్దరు పేర్లను ఓట్ల జాబితానుంచి తొలగించిన ఘటన వెలుగులోకి వచ్చింది.

Delete vote by Stating Living in Bangalore: విడపనకల్లుకు చెందిన ఓ యువకుడు ఇర్పాన్ బెంగళూరులో నివసిస్తున్నట్లు పేర్కొంటూ తన ఓటును వైఎస్​ఆర్​సీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఫిర్యాదు చేిసి తొలగించాలని ఆవేదన వ్యక్తం చేశారు. తాను డ్రైవర్​గా పని చేసుకుంటూ గ్రామంలోనే జీవనం సాగిస్తున్నని పేర్కొన్నారు. టీడీపీ పార్టీకి మద్దతు ఇస్తున్నాననే నెపంతో తాను గ్రామంలోనే నివసిస్తున్నా బెంగళూరులో ఉన్నట్టు తప్పుడు ఆధారాలు సృష్టించి మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఓటు తొలగించారని ఇర్పాన్ మండిపడ్డారు. విశ్వేశ్వరరెడ్డి ఓటు తొలగించాలని చేసిన ఫిర్యాదుపై విచారణ జరపకుండానే బీఎల్వో నివేదిక తయారుచేయడంపై ఇర్పాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

"నేను మా గ్రామంలో నివసిస్తున్నా బెంగుళూరులో ఉన్నట్లు తెలిపి నా ఓటును మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తొలగించారు. తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తే ఓటరు జాబితా నుంచి తొలగిస్తారా?" -ఇర్పాన్, బాధితుడు

Name Placed in Death Voter List: అనంతపురం జిల్లా చీకలగురికి గ్రామానికి చెందిన ప్రేమావతమ్మ అనే మహిళ ఓటును ఓట్ల జాబితా నుంచి తొలగించారు. మృతి చెందిందని ఓటరు తొలగింపుల జాబితాలో, డెత్ అని నమోదు చేశారు. బతికి ఉండగానే నా ఓటు ఎలా తొలగిస్తారని, తెలుగుదేశం పార్టీకీ మద్దతు ఇస్తే ఓట్ల జాబితా నుంచి తొలగిస్తాారా అని ప్రేమావతమ్మ బీఎల్వోను ప్రశ్నించారు. టీడీపీ మద్దతు ఇస్తే చనిపోయినట్లు లెక్కకడతారా అని మహిళ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ మద్దతుదారులుగా ఉన్న వారి ఓట్లను తొలగించడమే వైఎస్​ఆర్​సీపీ నాయకులు పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. టీడీపీకి ఎంత మంది మద్దతు ఇస్తే అంతమంది ఓట్లూ తొలగిస్తారా అని అధికారులను ప్రశ్నిస్తున్నారు. వైఎస్​ఆర్​సీపీ నాయకులు ఓట్ల తొలగించేందుకు అధికారులు సహకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉద్యోగం కోసం వేరే ఊరు వెళ్తే ఓటు తీసేయటం సరికాదు - నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ నిరసన

ABOUT THE AUTHOR

...view details