ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

VARIETY REQUEST: బ్యాలెట్​ బాక్స్​లో చీటీ..మందుబాబు విజ్ఞప్తి చూస్తే షాక్​.. - counting news

సమాజంలో ఒక్కొక్కరిది ఒకో సమస్య.. అవకాశం వస్తే..తమ సమస్యను పాలకులకు, అధికారులకు చెప్పుకునేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తుంటారు. అయితే ఓ వ్యక్తి తనకు వచ్చిన సమస్యను అందరీ దృష్టికి తేవాలనుకున్నాడు. అంతే ఎలా అని ఆలోచించాడు. అదే సమయంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రావడంతో.. ఓటుతో పాటు బ్యాలెట్​ బాక్సులో తన విజ్ఞప్తిని కూడా జతచేశాడు.. ఈ విజ్ఞప్తి చేసి ఎన్నో రోజులైనప్పటికీ.. ఈరోజు ఆ ఓట్లు లెక్కిస్తుండగా బయటపడింది. ఇంతకు ఆ మందుబాబు చేసిన విజ్ఞప్తి ఏంటీ... అది ఎక్కడ జరిగిందో తెలుసా...

బ్యాలెట్ బాక్సులో ఓటరు రిక్వెస్ట్
వైన్సుల్లో మంచి బ్రాండ్లు పెట్టండి

By

Published : Sep 19, 2021, 5:05 PM IST

బ్యాలెట్​ బాక్స్​లో చీటీ..మందుబాబు విజ్ఞప్తి చూస్తే షాక్​..

తమ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు వినూత్నంగా ఆలోచించాడు ఓ మందుబాబు. అంతేకాదు దానిని ఆచరించిన తీరు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అనంతపురం జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అతడు చేసిన పని వెలుగులోకి రావడంతో అందరి దృష్టినీ ఆకర్షించింది. ఓట్లను లెక్కిస్తున్న సిబ్బంది బ్యాలెట్ బాక్సులో ఒక చీటీని గమనించారు. ఏంటా అని తెరిచి చదివారు..అందులో ఉన్న విషయాన్ని చదివి అవాక్కయ్యారు. ఓటుతో పాటు మందుబాబులు తమ ఇబ్బందికి సంబంధించిన విజ్ఞప్తిని జతపరచి.. సమస్యను పరిష్కరించాలంటూ కోరారు.

రాష్ట్రంలో ప్రభుత్వం తెచ్చిన వివిధ రకాల మద్యం బ్రాండ్లతో విసుగెత్తిపోతున్నామని గోడు వెళ్లగక్కాడు. ప్రస్తుతం సరఫరా చేస్తున్న మద్యాన్ని నిలిపివేసి.. మంచి బ్రాండ్లను అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ..ఒక ఓటరు తన ఓటుతో పాటు ఒక చీటీని రాసి బ్యాలెట్ బాక్సులో వేశారు.

తమ ప్రాంతంలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో శీతల బీరులతో.. పాటు మంచి బ్రాండ్ మద్యాన్ని అందుబాటులో ఉంచాలని.. నల్లచెరువు మండలంలోని తలమర్లవాండ్లపల్లి ఎంపీటీసీ పరిధిలోని ఓ మందుబాబు ప్రభుత్వానికి సూచించాడు. చీటీలో నల్లచెరువు యూత్ మందుబాబులు అంటూ రాసి సంతకం చేశాడు.

ఇదీ చదవండి:

ANANTHAPURAM : అనంతపురం జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

ABOUT THE AUTHOR

...view details