ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వాలంటీర్ ప్రేమాయణం... బంధువుల దేహశుద్ధి

అతడో గ్రామ వాలంటీర్.. గ్రామంలో ఉన్న ఓ వివాహితకు ప్రేమ లేఖ రాసిచ్చాడు. గ్రామ వాలంటీర్​పై చర్యలు తీసుకోవాలని ఆ వివాహిత కుటుంబ సభ్యులు ఎంపీడీఓ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు.. అంతేగాకుండా.. ప్రేమ లేఖ ఇచ్చిన వాలంటీర్​కు దేహశుద్ధి కూడా చేశారు!

volunteer wrote love letter to married women
వివాహితకు ప్రేమ లేఖ ఇచ్చిన గ్రామ వాలంటీర్

By

Published : Aug 3, 2020, 7:53 PM IST

వివాహితకు ప్రేమ లేఖ ఇచ్చిన గ్రామ వాలంటీర్

అనంతపురం జిల్లా నార్పల మండలం ఉయ్యాలకుంటాలో సుబ్రమణ్యం గ్రామ వాలంటీర్​గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతడు ఓ వివాహితకు ప్రేమ లేఖ రాసిచ్చాడు. ఇదేనా ఒక వాలంటీర్​ పద్ధతి అంటూ ఎంపీడీవో కార్యాలయం ముందు వివాహిత కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. సుబ్రమణ్యంపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. పంచాయతీ కార్యాలయంలో ఎలక్ట్రీషియన్​గా పని చేస్తున్న ప్రభు.. ఈ వివాదాన్ని సోషల్​ మీడియాలో వైరల్ చేశాడనీ, అతడపైనా చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రేమ లేఖ అందించిన వాలంటీర్​ సుబ్రమణ్యంకు వివాహిత కుటుంబ సభ్యులు దేహశుద్ధి చేసి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి:పారిశుద్ధ్యం, కొవిడ్ వ్యాప్తి నియంత్రణకు బ్యాటరీ వాహనాలు

ABOUT THE AUTHOR

...view details