అనంతపురం జిల్లా గుంతకల్లులోని దాతలు... 37 మంది దివ్యాంగులకు వారానికి సరిపడా నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. డాక్టర్ వెంకటేశ్వర్లు, 'ఆ నలుగురు' సేవా సమితి చొరవతో వీటిని అందించారు.
లాక్డౌన్ వల్ల నెల రోజులపాటు తిండిలేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అమృతవర్షిని బాల కల్యాణ్ ఆశ్రమంలోని వారికి సరకులు పంచారు.