ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కదిరిలో విశ్వహిందూ పరిషత్ నాయకుల ఆందోళన - vishwahindu parishad members protest in kadiri

అనంతపురం జిల్లా కదిరి ఆర్డీవో కార్యాలయం ఎదుట విశ్వహిందూ పరిషత్ నాయకులు ఆందోళన చేపట్టారు. అంతర్వేది ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

vishwahindu parishad members protest in kadiri in ananthapur about antarvedi issue
కదిరిలో విశ్వహిందూ పరిషత్ నాయకుల ఆందోళన

By

Published : Sep 9, 2020, 10:42 PM IST

హిందూ దేవాలయాల పై జరుగుతున్న దాడులను నిరసిస్తూ అనంతపురం జిల్లా కదిరి ఆర్డీవో కార్యాలయం ఎదుట విశ్వహిందూ పరిషత్ నాయకులు ఆందోళన చేపట్టారు. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ రథం దగ్ధం ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ నిరసన చేపట్టారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న దేవాదాయ శాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలంటూ నాయకులు డిమాండ్ చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details