ఊరంతా భక్తిశ్రద్ధలతో గ్రామదేవత విగ్రహ ప్రతిష్ఠ - maremma temple
అనంతపురం జిల్లా కదిరి మండలం అల్లిపురంతండాలో గ్రామదేవత మారెమ్మగుడిలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని గ్రామస్థులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. హంద్రీనీవా కాలువ వద్ద మహిళలు పూలు, పాలు, ఫలాలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
అనంతపురం జిల్లా కదిరి మండలం అల్లిపురంతండాలో గ్రామదేవత మారెమ్మగుడిలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఊరంతా ఒకచోట చేరి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరుపుకున్నారు. కలశ స్థాపనతో పాటు బోనాలతో.... తండాకు సమీపంలోని హంద్రీనీవా కాలువ వద్దకు చేరుకుని పుష్పాలు, పాలు, ఫలాలు సమర్పించుకుని గ్రామస్థులు మొక్కులు తీర్చుకున్నారు. గిరిజన సంప్రదాయ పద్ధతిలో భక్తిశ్రద్ధలతో నృత్యాలు చేస్తూ సంబరం చేసుకున్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి హోమాలు నిర్వహించారు.