అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని గూబనపల్లిలో గతేడాది ప్రధాన రహదారి విస్తరించారు. రోడ్డును ఎత్తుగా చేసి.. వర్షపు నీరు పారేందుకు సరైన మార్గం ఏర్పాటు చేయలేదు. ఇది ఇప్పుడు కాలనీ వాసులకు ఇబ్బందిగా మారింది. వర్షం వచ్చినప్పుడల్లా ఇళ్లల్లోకి మురికి నీటితోపాటు వర్షపు నీరు చేరుతుందని గ్రామస్థులు వాపోయారు.
డ్రైనేజి వ్యవస్థ మెరుగుపరచాలని గ్రామస్థుల ఆందోళన
డ్రైనేజి వ్యవస్థ బాగు చేయాలని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటిలోని గూబనపల్లి గ్రామస్థులు రాస్తారోకో నిర్వహించారు. సమాచారం అందుకున్న పోలీసులు జోక్యం చేసుకున్నారు. సమస్యను ఉన్నతధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఇచ్చిన హామీతో ప్రజలు ఆందోళన విరమించారు.
డ్రైనేజి వ్యవస్థను మెరుగుపరచాలని గ్రామస్తుల ఆందోళన
ఈ సమస్య పరిష్కరించాలని రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని గ్రామస్థులను సముదాయించారు. రాస్తారోకో చేసి నందుకు మందలించే ప్రయత్నం చేశారు. ఇది ఉద్రిక్తతకు దారి తీసింది. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా ప్రయత్నిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. వారిచ్చిన మాటతో గ్రామస్థులు శాంతించి ఆందోళన విరమించుకున్నారు.
ఇదీ చదవండి