అనంతపురం జిల్లా రాప్తాడు మండలం బండమీదపల్లి గ్రామ సచివాలయానికి భద్రత కరవైంది. పదుల సంఖ్యలో అధికారులు విధులు నిర్వహించే కార్యాలయంలో రాత్రివేళ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. బుధవారం రాత్రి సచివాలయంలో కొంతమంది మద్యం తాగి సీసాలు, తినుబండారాల కవర్లను కుర్చీలపైనే వదిలేశారు. ప్రజలు సమస్యలపై ఇచ్చిన అర్జీలను చెల్లాచెదురు చేశారు. కంప్యూటర్లు, సాంకేతిక పరికరాలకు అమర్చిన తీగలు కత్తిరించి వెళ్లిపోయారు. ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శి అరుణ్‌ను వివరణ కోరగా గుర్తు తెలియని వ్యక్తులు రాత్రిపూట సచివాలయ తాళాలు పగులగొట్టి మద్యం తాగారని తెలిపారు. సంఘటనపై రాప్తాడు పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి విచారిస్తున్నారు.
గ్రామ సచివాలయంలో మందుబాబుల హల్‌చల్ - bandameedapalli latest news
ప్రభుత్వ కార్యాలయం అసాంఘిక చర్యలకు అడ్డాగా మారింది. మద్యం సీసాలు, తినుబండారాల ఖాళీ ప్యాకెట్లతో ప్రాంగణం అంతా చెత్త చేశారు. అయినా అధికారులు పట్టించుకోవట్లేదని అనంతపురం జిల్లా బండమీదపల్లి గ్రామస్థులు వాపోతున్నారు.
చిందరవందరగా గ్రామ సచివాలయం