అనంతపురం జిల్లా సెట్టూరు మండలంలోని ఐదకల్లు గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. నిత్యం పదుల సంఖ్యలో ఇసుక టిప్పర్లను తిప్పుతూ.. రోడ్లను ధ్వంసం చేస్తున్నారంటూ గ్రామస్థులు వాహనాలను అడ్డుకున్నారు. గ్రామంలో నూతనంగా వేసిన వన్ వే రహదార అని.. రోడ్డు ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇసుక టిప్పర్లను అడ్డుకున్న గ్రామస్థులు - అనంతపురం జిల్లాలో ధర్నా
తమ గ్రామం నుంచి ఇసుక టిప్పర్లను వెళ్లనీయమంటూ అనంతపురం జిల్లా ఐదకల్లు వాసులు ఇసుక వాహనాలను అడ్డుకున్నారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఇసుక టిప్పర్లను వెళ్లనీయమంటూ ఐదకల్లు గ్రామస్థుల ఆందోళన
బ్రహ్మసముద్రం మండలం అంజయ్యదొడ్డి ఇసుక రీచ్ నుంచి అనంతపురంలో ఓ కాంట్రాక్టర్కు తరలిస్తున్నారని చెప్పగానే.. స్థానిక ప్రజాప్రతినిధులు వారిని వదిలేస్తున్నారని గ్రామస్థులు వాపోయారు.
ఇదీ చదవండి..