ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 18, 2020, 9:58 PM IST

ETV Bharat / state

రోడ్డు ప్రమాదానికి కారకులైన వారిని శిక్షించాలంటూ గ్రామస్థుల ఆందోళన

అనంతపురం జిల్లా పామిడి మండలం సొరకాయలపేట గ్రామ సమీపంలో.. నిన్న సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. ప్రమాదానికి కారకులైన వారిని వెంటనే శిక్షించాలని పాలెంతండా గ్రామస్థులు నిరసన చేపట్టారు. నిందితులను అరెస్టు చేస్తామని పోలీసులు అక్కడకు చేరుకుని నిరసనకారుల ఆందోళనను విరమింపజేశారు.

villagers protest to arrest the victims responsible for road accident at ananthapur district
రోడ్డు ప్రమాదానికి కారకులైన వారిని శిక్షించాలని గ్రామస్థుల ఆందోళన

అనంతపురం జిల్లా పామిడి మండలం సొరకాయలపేట గ్రామ సమీపంలో నిన్న సాయంత్రం జరిగిన ప్రమాదానికి కారణమైన వారిని శిక్షించాలంటూ.. పాలెంతండా గ్రామస్థులు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేపట్టారు. పాలెంతండాకు చెందిన డాక్యా నాయక్.. నిన్న సాయంత్రం పామిడి నుండి తిరిగి తమ స్వగ్రామానికి వస్తుండగా.. తన ద్విచక్ర వాహనాన్ని మరో వాహనం ఢీకొని మృతిచెందాడు. ప్రమాదానికి కారణమైన వారిపై వెంటనే కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.

మృతుని కుటుంబసభ్యులు, గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో జాతీయ రహదారిపై.. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణమైన వారిపై కేసు నమోదు చేస్తామని చెప్పటంతో.. గ్రామస్థులు ఆందోళన విరమించారు. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details