అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం పాలవాయి గ్రామంలో ప్రధాన రహదారిని వెంటనే మరమ్మతు చేయాలని ఆ గ్రామస్తులు కోరుతున్నారు. చిన్నపాటి వర్షానికే రహదారుల వెంబడి నీరు చేరి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారిలో వాహనచోదకులకు రాకపోకలు కష్టంగా మారాయి. రోడ్డుకు ఇరువైపులా ఉన్న వారికి దుర్వాసన, దోమలతో ఆరోగ్యాలు పాడయ్యే ప్రమాదం ఉందని ఆందోళన చెందారు. అధికారులు సమస్యను పరిష్కరించాలని కోరారు. గుంతలు పూడ్చి మరమ్మతులు చేయాలన్నారు.