అనంతపురం జిల్లా అగలి పట్టణంలో శ్రీ శంకర లింగేశ్వర స్వామి పురాతన దేవాలయంలో వెండి, బంగారు ఆభరణాలు దొంగిలించేందుకు కర్ణాటకకు చెందిన దొంగల ముఠా యత్నించింది. అదే సమయంలో పహారా కాస్తున్న పోలీసులు ఈల వేయడంతో దొంగల ముఠా పారిపోయేందుకు ప్రయత్నించింది. కేకలు విని గ్రామస్తులు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. గ్రామస్తులు, పోలీసులు కలిపి దొంగల ముఠాలోని ఒకరిని పట్టుకున్నారు. అతన్ని విచారించి ముఠాలో మిగిలిన సభ్యులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
దోపిడీకి యత్నం..పోలీసులకు దొరికిన దొంగ - agali
ఆలయంలో దొంగతనానికి అంతరాష్ట్ర దొంగలముఠా చోరీకి యత్నించింది. పహారా కాస్తున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. గ్రామస్తుల సహకారంలో ముఠాలోని ఒక దొంగను పట్టుకున్నారు.
పోలీసులు, గ్రామస్తులు ఒక్కటై దొంగను పట్టారు...