అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠపురం గ్రామానికి చెందిన భాగ్యమ్మ అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానిక గ్రామ సచివాలయంలో గ్రామ వాలంటరీగా విధులు నిర్వహిస్తున్న భాగ్యమ్మకు, ఆమె భర్త వెంకటేష్‌కు తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో సోమవారం రాత్రి.. ఇద్దరూ ఘర్షణకు దిగారు. ఆవేశంలో వెంకటేష్ భాగ్యమ్మను హత్య చేసినట్లు మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనను సహజ మరణంగా చిత్రీకరించేందుకు యత్నిస్తున్నాడని తెలిపారు. వెంకటేష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతికి గల కారణాలను ఆరా తీస్తున్నారు.
గ్రామ వాలంటీర్ అనుమానాస్పద మృతి - అనంతపురం జిల్లా నేర వార్తలు
అనంతపురం జిల్లా నీలకంఠపురంలో విషాదం నెలకొంది. గ్రామ వాలంటీర్‌గా విధులు నిర్వహిస్తున్న ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గ్రామ వాలంటీర్ అనుమానాస్పద మృతి