ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యం: మంత్రి శంకరనారాయణ - Minister of Roads and Buildings news

ప్రజల సమస్యల సత్వర పరిష్కారమే తమ ప్రభుత్వ లక్ష్యమని రోడ్లు భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ అన్నారు. అనంతపురం జిల్లా నంబులపూలకుంట మండలం పి.కొత్తపల్లిలో గ్రామ సచివాలయాన్ని మంత్రి ప్రారంభించారు.

village secretariat opening by minister
సచివాలయాన్ని ప్రారంభిస్తున్న మంత్రి శంకరనారాయణ

By

Published : Oct 31, 2020, 11:55 AM IST

అనంతపురం జిల్లా పి.కొత్తపల్లిలో గ్రామ సచివాలయాన్ని రోడ్లు భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ ప్రారంభించారు. ప్రజల సమస్యలు సకాలంలో పరిష్కరించేలా సచివాలయ వ్యవస్థను అమల్లోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. దీని ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చని అన్నారు.

ప్రజలు తమ పనుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతూ వ్యయ ప్రయాసలకు గురికాకుండా సచివాలయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హిందూపురం పార్లమెంటరీ నియోజకవర్గ సభ్యులు గోరంట్ల మాధవ్, కదిరి శాసనసభ్యుడు సిద్ధారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details