ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆ 195 మందికి.. విడుదల పత్రాలు ఇవ్వండి' - వెట్టి చాకిరీ దారుపై వార్తలు

అనంతపురం జిల్లా మడకశిరలో ఉన్న వెట్టిచాకిరిదారులకు విడుదల పత్రాలు మంజూరు చేయాలని కోరుతూ.. జీవిస సంస్థ ప్రతినిధులు ఎమ్మార్వోకు వినతిపత్రం అందించారు. వారికి ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకం అందించాలని కోరారు.

Vettichakiridar's request to MRO to grant release documents
విడుదల పత్రాలు మంజూరు చేయాలని ఎమ్మార్వోకు వెట్టిచాకిరిదారుల వినతి

By

Published : Sep 22, 2020, 8:38 AM IST

అనంతపురం జిల్లా మడకశిరలో వెట్టిచాకిరి చేసిన వారికి విడుదల పత్రాలు మంజూరు చేయాలని ఎమ్మార్వోకు జీవిక సంస్థ ప్రతినిధులు వినతిపత్రం అందించారు. బాధితులతో కలిసి ఎమ్మార్వోను కలిశారు. వారికి విడుదల పత్రాలు అందించి.. ప్రతి నెల ప్రభుత్వం ద్వారా ప్రోత్సాహకం అందించాలని కోరారు.

గత ఎమ్మార్వోలు నియోజకవర్గ వ్యాప్తంగా పరిశీలించి 195 మంది వెట్టిచాకిరి చేస్తున్నట్లు గుర్తించారని పేర్కొన్నారు. అయితే.. ధ్రువపత్రాల విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని బాధితులు అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వం ద్వారా తమకు పత్రాలు మంజూరు చేయించి, ప్రోత్సాహం అందించాలని వెట్టిచాకిరి దారులు విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details